నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా అత్యంత క్రియాశీలకంగా ఉన్నాయి. ఆ కారణంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతం తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ రెండిటి ప్రభావం తో చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. దక్షిణ భారతావని అంతటా ఆకాశం మేఘావృతమై ఉన్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ చాలా చోట్ల దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాలు , రాయల సీమ, యానాం తదితర చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలంగాణలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఈ హెచ్చరికలతో అధికారులు మరింత అప్రమత్తం కావాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: