ఏపీ ఆర్థిక పరిస్థతి బాగోలేదంటూ కథనాలు వస్తున్నా పథకాల విషయంలో మాత్రం జగన్ సర్కారు ఎక్కడా తగ్గడం లేదు. ఏ పథకాన్ని ఆపుతున్న దాఖలాలు కనిపించడం లేదు. తాజాగా వైఎస్సార్‌ చేయూత పథకం నిధులను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాల విడుదల చేయనుంది. 45 నుండి 60 ఏళ్ళ మధ్య వయస్సు గల పేద మహిళలకు 18 వేల 750 రూపాయల చొప్పున సీఎం జగన్ ఆర్ధిక సాయం అందించనున్నారు.

అర్హులైన  పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు జగన్ సర్కారు ఈ ఆర్ధిక సాయం అందించనుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్   కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నిధులను విడుదల చేస్తారు. దాని ద్వారా నేరుగా మహిళల ఖాతాల్లోనే డబ్బులు జమ కానున్నాయి. మొత్తం 26లక్షల 39 వేల703 మంది మహిళల అకౌంట్లలోకి  4వేల 949.44 కోట్ల నిధులను సీఎం జగన్ పంపనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: