ఏపీలో సీఎం జగన్‌ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పోలీసు నియామకాలకు నోటిఫికేషన్‌ ఏపీలో విడుదలైంది. మొత్తం 6100 కానిస్టేబుళ్లు, 411 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వీటిలో 315 ఎస్‌ఐ పోస్టులు.. 96 రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. మొత్తం 6100 కానిస్టేబుల్‌ పోస్టుల్లో 3,580 సివిల్‌ పోస్టులు.. 2 వేల520 ఏపీఎస్పీ పోస్టులు ఉన్నాయి.

కానిస్టేబుల్‌ పోస్టులకు ఈనెల30 నుంచి డిసెంబర్‌ 28 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 9 నుంచి హాల్‌టికెట్లు జారీ చేసి... జనవరి 22న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఎస్‌ఐ పోస్టులకు డిసెంబర్‌ 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 5 నుంచి హాల్‌టికెట్లు జారీ చేసి  ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

job