చంద్రబాబుకు ఆర్థిక బలం, కమ్మ బలం, మీడియా సపోర్ట్ ఉందని.. కానీ.. వైయ‌స్ జ‌గ‌న్‌కు మాత్రం ప్రజా బలం ఉందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. లోకేష్ వంటి బుజ్జి బాబులు చేసిన విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అంటున్నారు. పాద‌యాత్రలో ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతూ నారా లోకేష్ నవ్వుల పాలవుతున్నారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.


ఆత్మకూరులో అభివృద్ది లేదని విమర్శించే వాళ్లు అక్కడికి వెళ్లి చూస్తే తెలుస్తుందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. బుద్ధి, జ్ఞానం లేకుండా నారా లోకేష్ విమర్శలు చేస్తున్నాడ‌న్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో త‌మ స‌త్తా ఏంటో చూపిస్తామని అన్నారు. నెల్లూరులో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులు అన్నీ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పుణ్యమేనని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అంటున్నారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మళ్లీ వైయ‌స్‌ జగనే సీఎం కావాల‌ని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: