రంగారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్ రూంల కేటాయింపు విషయం వివాదం అవుతోంది. ఈ ఇళ్ల కేటాయింపు అంశంలో ప్రతిపక్షాలు హిందూ-ముస్లిం విబేధాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆ జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆక్షేపించారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడం మంచి పద్దతి కాదని సబితా హితవు పలికారు.


కులం, మతంతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి పారదర్శకంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు జరుగుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. ఈ నెల 21న రెండో విడతగా మరో 13,400 ఇళ్లను కేటాయించనున్నట్లు మంత్రి సబిత తెలిపారు. ఈ విషయంలో ప్రజలంతా విజ్ఞతతో వ్యవహరించాలని మంత్రి సబిత కోరారు. రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: