క్యాన్సర్‌.. ఈ మహమ్మరి ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియదు. అంతేకాదు.. దీనికి చికిత్స చాలా ఖరీదైంది. పేదలకు ఈ క్యాన్సర్ వస్తే.. వారి బాధలు వర్ణనాతీతం. అలాంటి వారికి హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి కల్పతరువుగా నిలుస్తోంది. క్యాన్సర్ చికిత్సలో తెలంగాణ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోంది. హైదరాబాద్ ఎంఎన్ జే ఆస్పత్రిలో నూతనంగా రోబోటిక్ సర్జరీ థియేటర్ కూడా ఏర్పాటైంది. రూ. 34 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ రోబోటిక్ థియేటర్ ద్వారా ఎంతోమంది రోగులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చు. దేశంలోనే మూడో అతి పెద్ద ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రిగా ఎంఎన్ జే నిలిచింది.

రూపాయి ఖర్చు లేకుండా బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్లు సైతం ఎంఎన్ జే ఆస్పత్రిలో నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. క్యాన్సర్ తో అవసానదశలో బాధపడుతున్న వారి కోసం పాలియేటివ్ సేవలు ఈ క్యాన్సర్ ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చారు. అవసరమైన వారికి ఇంటి వద్దే పాలియేటివ్ సేవలు కూడా అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: