కోలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు బిచ్చగాడు చిత్రం ద్వారా తెలుగు ప్రజలకు బాగా సుపరిచితం అయిన విజయ్‌ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. విజయ్‌ ఆంటోనీ కుమార్తె లారా ఆత్మహత్య చేసుకుంది. విజయ్‌ ఆంటోనీ కుమార్తె లారా వయస్సు 16 ఏళ్లు. విజయ్‌ ఆంటోనీ కుమార్తె లారా చెన్నైలోని నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.


విజయ్‌ ఆంటోనీ కుమార్తె లారా చెన్నైలోని ఓప్రైవేటు పాఠశాలలో లారా ఇంటర్‌ చదువుతున్నట్టు తెలుస్తోంది. అయితే లారా ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు. చేతికి ఎదిగిన కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో విజయ్‌ ఆంటోనీ కుటుంబం షాక్‌లో ఉంది. కోలీవుడ్ ప్రముఖులు విజయ్‌ ఆంటోనీ కుమార్తె మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆయన్ను పరామర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: