సీఎం కేసీఆర్‌ ఎన్నికల పర్యటన కాస్త రూటు మారింది. కేసీఆర్‌ నియోజకవర్గాల పర్యటనల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 26న ముందుగా ప్రకటించిన నాగర్ కర్నూలు బదులుగా వనపర్తిలో సీఎం కేసీఆర్‌ సభ నిర్వహిస్తారు. ఈనెల 27న గతంలో ప్రకటించిన స్టేషన్ ఘన్ పూర్ బదులుగా సీఎం కేసీఆర్‌ మహబూబాబాద్, వర్దన్నపేటలో కేసీఆర్ ప్రజాశీర్వాద సభల్లో పాల్గొంటారు. 


ఇక మిగలిన సీఎం కేసీఆర్‌ సభలన్నీ యథాతథంగా ఉంటాయి. ఈనెల 15న మేనిఫెస్టో ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం చుట్టారు. రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున.. ఇప్పటి వరకు హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిద్ధిపేట, సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్ లో సీఎం కేసీఆర్‌ ప్రజాశీర్వాద సభలు నిర్వహించారు. బతుకమ్మ, దసరా పండగలు ఉన్నందున సభలకు విరామం ఇచ్చిన సీఎం కేసీఆర్‌.. మళ్లీ సుడిగాలి పర్యటనలకు సిద్ధమవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: