తెలంగాణాలో ప్రజా సర్కార్‌ లేదని ఫామ్‌ హౌస్‌ సర్కార్‌ నడుస్తోందని కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే ఆరోపించారు. ఇక్కడ అవినీతి ప్రభుత్వం నడుస్తోందన్న ప్రియాంక్‌ ఖర్గే .. కేసీఆర్ ప్రభుత్వ పథకాల పేరున భారీగా దోచేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య తేడా ఆయన వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే ప్రజల డబ్బు ప్రజలకు పంచి పెడతారని, అదే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉంటే ప్రజల సొమ్మును ఫామ్‌హౌస్‌కు తరలిస్తారని ప్రియాంక్‌ ఖర్గే ఆరోపించారు.

కర్ణాటకను తక్కువ చేసి ప్రకటనలు ఇవ్వడంపై ప్రియాంక్‌ ఖర్గే  తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ కష్టాలు, స్కాంగ్రెస్‌ అంటూ బీఆర్‌ఎస్‌ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడాన్ని ప్రియాంక్‌ ఖర్గే  తప్పు బట్టారు. కర్ణాటకలో తాము ఇచ్చిన అయిదు గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు ప్రియాంక్‌ ఖర్గే  గణాంకాలతో వివరించారు. 166హామీలు ఇచ్చిన తాము 158 హామీలను ఇప్పటి వరకు నెరవేర్చామని ప్రియాంక్‌ ఖర్గే వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: