హైదరాబాద్‌లోని బాలానగరం ప్రాంతం ఒకప్పుడు పరిశ్రమలకు ఆలవాలంగా ఉండేది. అక్కడే కేంద్రం ఐడీపీఎల్ సంస్థను కొన్ని దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసింది. ఆ సంస్థకు రాష్ట్రం అప్పట్లో వందల ఎకరాల భూములు ఇచ్చింది. అయితే ఈ ఐడీపీఎల్ మూతపడి చాలా కాలమైనా ఆ భూములు ఇంకా ఆ సంస్థ వద్దనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌ భూములపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలానగర్ లోని ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.


పరిశ్రమలకు థర్మల్ విద్యుత్ వినియోగం కాకుండా సోలార్ పవర్‌ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తూ తగు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి  సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: