శ్రీశైలం, సాగర్‌ కేంద్రానికి అప్పగించారా లేదా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి సర్కారు కేంద్రానికి అప్పగించిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. జల విద్యుత్ ఔట్ లెట్ల స్వాధీనం కోసం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలని ఈఎన్సీ చెప్పారు కానీ, ఇతర ఔట్ లెట్ల గురించి అభ్యంతరం చెప్పలేదని హరీశ్ రావు అన్నారు. ప్రాజెక్టులు అప్పగించకపోతే రెండు రాష్ట్రాలు ఉద్యోగులను ఇవ్వాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను అప్పగించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేక రెండు నెలల్లోనే అప్పగించి దిల్లీ చేతిలో పెట్టారని ఆరోపించారు.

రాజకీయాలు కాదు... రాష్ట్ర భవిష్యత్ ను ఫణంగా పెట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు కోరారు. పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలో పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ నేతలు తప్ప... తాము కాదని గుర్తు చేశారు. అయితే మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మాత్రం అదంతా పచ్చి అబద్ధమని.. తాము ప్రాజెక్టులు అప్పగించలేదని అంటున్నారు. ఏది నిజమో అర్థం కాక జనం గందరగోళంలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: