కేసీఆర్‌ 2014లో అధికారంలోకి రాగానే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు. రాష్ట్రమంతా సెలవు ఇచ్చి మరీ కుటుంబ సర్వే చేయించారు. అయితే.. ఆ సమాచారం మాత్రం ఎక్కడా పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదు. అందుకే ఇప్పుడు కుల గణన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి కుటుంబ సర్వే చేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభలో తీర్మానం కూడా చేశారు. కుల గణనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు.


రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే చేపట్టనున్నట్లు ప్రభుత్వం రేవంత్ వెల్లడించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన ప్రణాళికల కోసం ఈ సర్వే చేయనున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన నిధులను కేటాయించి బలహీన వర్గాలను ఆర్థికంగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌ తెలిపారు. గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటపెట్టకుండా.. రహస్యంగా దాచి పెట్టిందన్నారు. ఎన్నికలప్పుడు రాజకీయంగా వాడుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరి రేవంత్ అయినా ఆ సమాచారం బయటపెట్టొచ్చుగా అంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr