ఐదేళ్ల పాలనలో ఎంతో మంచి చేశామంటున్నారు సీఎం జగన్.. అందుకే మీకు మంచి జరిగితేనే ఓటేయండి.. లేకుంటే లేదని ఖరాఖండీగా చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 87 శాతం పైన ఇళ్లకు సంక్షేమ పథకాల ద్వారా మంచి చేశామంటున్న జగన్.. కుప్పం నియోజక వర్గంలోనే  93.23 శాతం  ప్రజలకు మంచి చేశామంటున్నారు. కుప్పం నియోజక వర్గంలోనే 87 వేల ఇళ్లు ఉంటే  83 వేల ఇళ్లకు మంచి జరిగిందన్నారు.


బటన్ నొక్కి  2లక్షల 55 వేల కోట్లను రాష్ట్ర వ్యాప్తంగా  పేదల ఖాతాల్లో జమ చేశామన్న జగన్..కుప్పం నియోజక వర్గంలోనే 83 వేల ఇళ్లకు 1400 కోట్లు ఇచ్చామని.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో  ప్రతిపక్షాలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చి అమలు చేశామని అన్నారు. వివక్ష, లంచాలు లేకుండా పథకాల అమలు సాధ్యమేనని 57 నెలల కాలంలో అమలు చేశామంటున్న జగన్.. 57 నెలల కాలంలో ఎవరి ఊహకు అందని విధంగా పరిపాలన చేశామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: