తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న 'రా కదలిరా' సభలు ముంగిపుకు వచ్చాయి. ముగింపు సభను ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహిస్తారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 23 చోట్ల 'రా కదలిరా' సభలు జరిగాయి. ఈ సీరిస్‌లో చివరి సభను  పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద నిర్వహిస్తారు.

గతంలో తెలుగుదేశం  ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కియా... దాని అనుబంధ పరిశ్రమలకు మధ్య ఈ సభ ఏర్పాటు చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ పెనుకొండ అభ్యర్థి  సవితకు చెందిన సొంత భూమిలో ఈ కదిలిరా సభ నిర్వహించనున్నారు. చంద్రబాబు నాయుడితోపాటు సభకు హాజరయ్యే ప్రజలకు కియా ప్రధాన పరిశ్రమతో పాటు, అనుబంధ పరిశ్రమలు కనపడేలా సభావేదికను తీర్చిదిద్దుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో తెలుగుదేశం నిర్వహిస్తున్న ఈ రా కదలిరా ముగింపును ప్రతిష్టాత్మకంగా నిర్వహించున్నారు. హిందూపురం పార్లమెంటు పరిధిలో నిర్వహిస్తున్న ఈ 24వ కార్యక్రమాన్ని ముగింపు సభగా టీడీపీ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: