మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి సీఎం రేవంత్‌ రెడ్డి ముహుర్తం ఖరారు చేశారు. ఈ నెల 8న పాతబస్తీలో రెండో దశకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5. కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులు మొదలుపెడతారు. సాలర్జంగ్ మ్యూజియం, ఛార్మినార్, శాలిబండ, ఫలక్ నుమా వరకు మార్గంలో నాలుగు స్టేషన్ల తో ఈ కారిడార్ అందుబాటులోకి రానుంది. రెండో దశలో మొత్తం 70 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు రూట్ మ్యాప్ లను ఖరారు చేశారు. ఈ నెల 8న రెండో దశలోని 5.5 కిలో మీటర్ల మార్గానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.

హైదరాబాద్ లో ప్రస్తుతం మెట్రో రైలు మూడు కారిడార్ లో 69 కి.మీ. మేర ఉంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు కనెక్టివిటీ ఉంది. ఈ 5.5. కిలోమీటర్లు అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా నేరుగా ఫలక్ నుమాకు చేరుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: