తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో బాంబు పేల్చారు. ఘాటు వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కలకలం రేపారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో తన తర్వాత ఎవరైనా సీఎం పదవికి అర్హుడు ఉన్నారంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డే అంటూ బహిరంగంగా ప్రకటించారు.

ఇప్పుడు ఈ ప్రకటన కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజార్టీ అసెంబ్లీ స్థానాలు ఖాయం కాగానే సీఎం రేసు మొదలైంది. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, అప్పటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం పదవికి బాగా పోటీ పడ్డారు. రెండు, మూడు రోజుల తర్వాత హైకమాండ్‌ రేవంత్‌ రెడ్డిని సీఎంగా భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎంగా ప్రకటించింది. అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి.. భట్టి, ఉత్తమ్‌ పేర్లు కాదని.. కోమటిరెడ్డిని సీఎం పదవికి అర్హుడు అని ప్రకటించడంతో కాంగ్రెస్‌లో చిచ్చు రాజుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: