సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలేనని..  మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. ఉరికిచ్చి కొడ్తా, పేగులు మెడలే వేసుకుంటా, బొందపెడ్తా, మానవ బాంబునవుతా అంటున్నావు.  ఇవేనా సీఎం మాట్లాడ్లాల్సింది అంటూ హరీశ్‌ రావు విమర్శించారు. హామీల గురించి అడిగితే హెచ్చరిస్తున్నావు కేసులు పెడుతున్నావన్న హరీశ్‌ రావు .. డిసెంబ్ 9న రుణమాఫీ చేస్తానని వందరోజులు దాటినా చేయనందుకు చెంపలేసుకుని 60 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు.  


మాట తప్పడం, అబద్ధాలు ఆడడం రేవంత్ నైజమన్న హరీశ్‌ రావు .. వెంకట్రామిరెడ్డిని లోకల్ కాదంటున్నావు, ఆయన ఇక్కడే స్థిరపడిన ఓటర్ అని.. కొడంగల్‌లో ఓడిపోయి మల్కాజిగిరికి పోయింది నువ్వేనని హరీశ్‌ రావు  అన్నారు. నా ఎత్తుతో రేవంత్‌కు ఏం పని? రైతుల గురించి ఆలోంచి, సమస్యలు పరిష్కరించాలని.. అహంకారంతో గాల్లో తేలుతున్న కాంగ్రెస్ భూమ్మీది రావాలంటే వెంకట్రామిరెడ్డిని పార్లమెంటుకు వెళ్లాలని హరీశ్‌ రావు  అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు 18 రోజులుగా వేచిచూస్తున్నా ప్రభుత్వం కొనడం లేదన్న హరీశ్‌ రావు .. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొన్నామని గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: