త్వరలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కూలబోతోందా.. ఆ పార్టీలో చీలిక రాబోతోందా.. అంటే అవునని చెబుతున్నారు మాజీ సీఎం కేసీఆర్‌.. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తీరుపై పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉందని.. ఆ పార్టీ వాళ్లే తమకు ఫోన్‌ చేసి బీఆర్ఎస్‌లోకి వస్తామని చెబుతున్నారని కేసీఆర్‌ అంటున్నారు. ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా పాతిక మంది వరకూ వస్తామని.. మీరూ.. మేమూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలంగాణను కాపాడుకుందామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చెబుతున్నారని కేసీఆర్‌ బాంబు పేల్చారు.


అయితే ఈ ప్రతిపాదనకు మీరు ఏం చెప్పారు.. ఓకే చెప్పారా అని అడిగితే.. దీనిపై నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేసీఆర్‌ బదులిచ్చారు. అయితే.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాత్రం రేవంత్ సర్కారు కూలడం ఖాయమని కేసీఆర్‌ చెబుతున్నారు. తాను మాత్రం రేవంత్ సర్కారు ఐదేళ్లూ ఉండాలని కోరుకుంటున్నానని కేసీఆర్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: