ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్వాతి మాలీవాల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు.  ఈ కేసులో ఇప్పుడు వైద్య నివేదిక చాలా కీలకంగా మారింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో స్వాతి మాలివాల్‌కు నిర్వహించిన వైద్యపరీక్షల్లో అనేక కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆప్‌ ఎంపీ ఎడమకాలు, కుడి చెంపపై... గాయాలు ఉన్నాయని వైద్య నివేదికలో తేలింది. దాదాపు 3గంటల వైద్య పరీక్షల అనంతరం ఆమె ముఖంపై గాయాలతోపాటు శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే స్వాతి మాలివాల్‌పై దాడి ఘటనను  పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్‌ చేశారు.

ఈనెల 17న సీఎం కేజ్రీవాల్ ఇంటికి ఆమెను తీసుకెళ్లిన పోలీసులు అదనపు డిప్యూటీ కమిషనర్ అజింత చెప్యాల నేతృత్వంలో నలుగురు ఫోరెన్సిక్ నిపుణులు అక్కడి సీసీటీవీ పుటేజీని సేకరించారు. తమ ముందు విచారణకు హాజరుకావాలని జాతీయ మహిళా కమిషన్ బిభవ్‌ కుమార్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ఇష్యూ కేజ్రీవాల్‌ ఇంట్లో జరిగింది కాబట్టి ఆయన్ను కూడా ఇందులో ఇరికిస్తారని ఆప్‌ నేతలు అనుమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: