కీరవాణి స్థానికత వివాదాస్పదం అవుతోంది. జయజయహే పాటను కీరవాణితో అందెశ్రీ ట్యూన్‌ చేయించాలని భావించడమే ఇందుకు కారణం. ఆ పాట ట్యూనింగ్‌కు తెలంగాణవారే దొరకలేదా అంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందిస్తున్న కాంగ్రెస్‌ నేతలు.. జయ జయహే తెలంగాణ పాటను కంపోజింగ్ ఎవరితో చేయించాలి అన్నవిషయంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్వేచ్ఛ అందెశ్రీకి ఇచ్చినట్లు చెబుతున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి అంతర్జాతీయ అవార్డు విన్నర్‌తో పాటను కంపోజింగ్‌ చేయిస్తే తప్పేమిటని వర్దన్నపేట ఎమ్మెల్యే కె.నాగరాజు ప్రశ్నించారు.


ఇంటర్నేషనల్ అవార్డు విన్నర్ కీరవాణి ఆ పాటకు స్వరాలను కూరిస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటని వర్దన్నపేట ఎమ్మెల్యే కె.నాగరాజు నిలదీశారు. సమంత, పుల్లెల గోపీచంద్, మంచు లక్ష్మి లాంటి వాళ్ళకి కేసీఆర్ అవకాశాలు కల్పించినప్పుడు ఆంధ్రా వాళ్ళు అని గుర్తులేదా అని వర్దన్నపేట ఎమ్మెల్యే కె.నాగరాజు ప్రశ్నించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ గుండు చేయించుకున్నంత మాత్రానా బుద్దిస్ట్‌నో, అంబేద్కరిస్ట్‌నో కాలేడని వర్దన్నపేట ఎమ్మెల్యే కె.నాగరాజు ఎద్దేవా చేశారు.


ఏనుగెక్కి ప్రగతి భవన్ పోదామన్నప్రవీణ్ కుమార్‌ ప్రవీణ్‌ ఎక్కడ పోయిండు? ఏనుగు ఎక్కడ పోయింది? అని వర్దన్నపేట ఎమ్మెల్యే కె.నాగరాజు నిలదీశారు. ప్రవీణ్ బీఆర్ఎస్‌లో చేరక ముందు నుంచి ఆయన కేసీఆర్ బాణమేనని వర్దన్నపేట ఎమ్మెల్యే కె.నాగరాజు స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ పదేండ్లు ఒకే పోస్ట్‌లో ఉన్నాడని.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఎవరు నమ్మవద్దు అని వర్దన్నపేట ఎమ్మెల్యే కె.నాగరాజు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: