రుషికొండలో జగన్ సర్కారు నిర్మించిన గెస్ట్ హవుస్‌లపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్.. విశాఖ లో జరిగిన అన్యాయాలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని.. రుషికొండ పై జరిగిన దారుణం చూశామని.. పేదవాడికి 48 గజాలు, జగన్ కి మాత్రం విలాస వంతమైన విశాల భవనాలు కట్టుకున్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అంటున్నారు. ఢిల్లీ లో ఆంధ్ర భవన్ కూడా మనకు సరిగ్గా లేదని.. ముందు ఋషి కొండను పర్యాటక హోటల్ అన్నారు. తరవాత పర్యాటక శాఖ భవనం అన్నారు.. చివరికి విలాసవంత మైన భవనం కట్టారు. దీని  సహకరించి, బాధ్యులైన అధికారులను శిక్షించాలని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ డిమాండ్ చేశారు.


రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి అంటే  కూటమి ఉండాలి అని ప్రజలు ఆలోచించారని.. ఈ మెజారిటీ లు చూస్తే ఒక రాజకీయ చరిత్ర సృష్టించాయని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. పెందుర్తి లో 67శాతం ఓట్లు బిజెపి కి వచ్చాయని.. అనకాపల్లిలో గెలిచిన, విశాఖలో కార్యకర్తలకు కూడా ఏ కష్టం వచ్చిన ముందు ఉంటానని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. త్వరలో విశాఖ లో బిజెపి కి మంచి కార్యాలయం నిర్మిస్తానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: