ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సా. 4 గం.కు పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతను చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది.


ఇప్పటికే టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని ఉన్నారు. దీంతో పార్లమెంటరీ పార్టీ నేత అవకాశం ఇస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొల్పుతోంది. ఈసారి లోక్ సభలో తెలుగుదేశం కి 16ఎంపీల బలం ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 24నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ కేంద్ర నిధులు తీసుకొచ్చేలా ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరి టీడీపీపీ నేతగా చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: