యాప్ ఆధారితంగా కాలింగ్ లు చేసుకోవడం వలన తమకి నష్టాలు వస్తున్నాయి అనేది అందరు టెలీకాం సంస్థలు చేస్తున్న గొడవ కి ట్రాయ్ స్పష్టత ఇవాల్సి ఉంది. ఈ టైం లో ఆ సర్వేసుల విషయం లో తమకి ఇబ్బందులు లేవు అంటోంది భారతీ ఎయిర్టెల్.బార్సిలోనాలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన గూగుల్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి ఇంటర్నెట్ సంస్థలతో తాము హ్యాపీగా కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. ఓవర్ ది టాప్ (ఓటీటీ) కంపెనీలు, టెలికం కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయని, తమ మధ్య ఇప్పుడు ఎటువంటి ఒత్తిళ్లు లేవని పేర్కొన్నారు. టెలికం కంపెనీల సహకారం లేకుండా ఓటీటీ సంస్థలు సేవలు అందించలేవన్నారు. టెలికం కంపెనీలు పెట్టుబడులను అధికంగా పెడుతుండడం వల్ల ఓటీటీల్లా తక్కువ రేట్లకు సర్వీసులను అందించే అవకాశం ఉండడం లేదన్నారు. టెలికం కంపెనీలు 20 వేల కోట్ల డాలర్ల మూల ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తోందని సునీల్ మిట్టల్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: