మూడేళ్లుగా టెలికాం రంగంలో ఆధిపత్యాన్ని కొనసాగుతున్న జియో  ప్రస్తుతం వృద్ధి  మెల్లగా మందగిస్తుంది. ఇతర నెట్ వర్క్ లకు చేసుకునే ఔట్ గోయింగ్ కాల్స్ కు జియో చార్జీలు వసూలు చేస్తుండటంతో  పాటు ఎయిర్ టెల్, వొడాఫోన్ లు అదే బాటలో ఉండటంతో మరియు  జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు నెల వారీ టారిఫ్ లను పెంచేయడంతో ప్రస్తుతం టెలికాం రంగంలో స్తబ్ధత నెలకొంది వినియోగదారులు వేరే నెట్ వర్క్ లకు మారాలని యోచిస్తున్నారు. 

 

దాన్ని అందిపుచ్చుకోవాలని ప్రభుత్వ రంగ టెలికామ్ బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ లతో ముందుకు వచ్చింది. బీఎస్ఎన్ఎల్ తన 4జీ ప్లాన్లను ఎంతో తక్కువ ధర నుంచి అందిస్తోంది. ప్రస్తుతం బీఎన్ఎన్ఎల్ అందించే రెండు 4జీ ఎస్టీవీల ధరలు రూ.96, రూ.236గా ఉన్నాయి. ఇవి అందించే లాభాల ప్రకారం చూస్తే.. రూ.96తో రీచార్జ్ చేసుకుంటే మీకు 28 రోజుల పాటు రోజుకు 10 జీబీ డేటా లభిస్తుంది. రూ.236తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 10 జీబీ డేటా 84 రోజుల పాటు లభిస్తుంది. డేటా పరంగా చూసుకుంటే ప్రస్తుతం మార్కెట్లో చవకైన ప్లాన్లు ఇవే! అయితే ఈ ప్లాన్ల ద్వారా ఎటువంటి వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ లాభాలు ఉండవు.
 
 telecomtalk.info అందించిన సమాచారం ప్రకారం బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే తన 4జీ సేవలను కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్ సర్కిళ్లలో పరీక్షించడం ప్రారంభించింది.  ఈ సేవలను మార్చి 2020 నుంచి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కానీ బీఎస్ఎన్ఎల్ లో అందుబాటులో ఉన్న ప్లాన్ల ప్రకారం చూస్తే బీఎస్ఎన్ఎల్ తన 4జీ సేవలను ఒక్కసారి లాంచ్ చేస్తే టెలికాం రంగంలో భారీ మార్పులు రావడం సహజం. అంతేకాకుండా ఇప్పటికే కొన్ని సర్కిళ్లలో రోజుకు 10 జీబీ డేటాతో ప్లాన్లను కూడా ఇప్పటికే ప్రకటించింది.
  

ఈ 4జీ ప్లాన్లు ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, చెన్నైల్లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. టెలికాంటాక్ ప్రకారం కేవలం మహారాష్ట్రలోనే బీఎస్ఎన్ఎల్ కు లక్షమంది వరకు 4జీ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ మంచి ప్లాన్లు, నెట్ వర్క్ తో వస్తే వినియోగదారుల ఆసక్తి కచ్చితంగా అటువైపు మళ్లుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: