సైరస్ మిస్త్రీ.. కొన్నాళ్ల క్రితం.. టాటా కంపెనీ పగ్గాలు అతని నుంచి బలవంతంగా లాగేశారు. ఈ అంశంపై ఆయన కోర్టుకెళ్లి పోరాడాడు. చివరకు విజయం సాధించాడు. టాటా సన్స్ కార్యనిర్వహక ఛైర్మన్ గా సైరస్ మిస్త్రీ పునర్నియమిస్తూ జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యూనల్ డిసెంబర్ 18న తీర్పు వెలువరించింది.

 

అయితే.. అనూహ్యంగా ఇప్పుడు సైరస్ మిస్త్రీ షాక్ ఇచ్చాడు. ఓవైపు సుప్రీంకోర్టులో టాటాసన్స్ సవాలు పిటిషన్ పై సోమవారం విచారణ ఉన్న సమయంలోనే సైరస్ మిస్త్రీ ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను టాటా సన్స్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించబోనని ఓ ప్రకటనలో స్పష్టంచేశారు.

 

టాటా గ్రూప్ నాయకత్వం గత మూడేళ్లుగా మైనారిటీ వాటాదారుల హక్కులపై అంతగా గౌరవం చూపడం లేదని సైరస్ తెలిపారు. టాటా గ్రూప్స్ కు తనకు మధ్య న్యాయ పోరాటం కేవలం మైనారిటీ వాటాదారుల హక్కులను కాపాడటం కోసమే అని మిస్త్రీ చెప్పారు.

 

రికార్డుల్లో ఉన్న అన్ని విషయాలను సమీక్షించిన తర్వాత తనను తొలగించిన పద్ధతి చట్టవిరుద్ధమైనదని జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ గుర్తించిందని పేర్కొన్నారు. అయినప్పటికీ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: