ఈ మధ్యకాలంలో దాదాపు నెల రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఆలా రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గటానికి కారణం కరోనా వైరస్ యెనట.. ఆ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం చూస్తే షాక్ అవుతారు. ఏంటి పెట్రోల్, డీజిల్ ఇంత తగ్గాయా అని.. ఎందుకంటే.. వరుసగా రెండు నెలలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజుల నుండి భారీగా తగ్గుతు వస్తున్నాయి.

 

అయితే ఇప్పుడు కరోనా వైరస్ పుణ్యమా అని పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం చైనాతో పాటు ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగానే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. రెండు నెలల క్రితం వరుకు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర మొన్నటి వరుకు 80 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర 66 రూపాయిలు ఉన్నది 75 రూపాయలకు చేరింది. 

 

అయితే ఇప్పుడు అవే పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజుల నుండి తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.  నేడు ఆదివారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 25 పైసల చొప్పున తగ్గగా... డీజిల్ ధర 28 పైసలు తగ్గింది. హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 25 పైసలు తగ్గుదలతో రూ. 77.08కు చేరగా, డీజల్ ధర 28 పైసలు తగ్గుదలతో 71.38 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా భారీగా తగ్గుతూ రావడం వాహనదారులకు గుడ్ న్యూస్ అయితే కరోనా కారణంగానే తగ్గాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: