చైనాకు వ్యతిరేకంగా ఇండియాలో ఓ వేవ్ నడుస్తోంది. గల్వాన్‌ ఘటనతో దేశంలో చైనా ఉత్పుత్తులు, సామాజిక మాధ్యమాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చైనా యాప్ లు వాడొద్దంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. అయితే మరి ప్రత్యామ్నాయం ఉండాలిగా.. కదా అవి ఉండే చైనా యాప్ లకు చెక్ చెప్పేందుకు రెడీ అని జనం కూడా నిరూపిస్తున్నారు.

 

 

టిక్‌టాక్‌కు ప్రత్యమ్నాయంగా స్వదేశీ పరిజ్ఞానంతో విడుదలైన చింగారి యాప్‌ కు ఇప్పుడు

మంచి క్రేజ్ వచ్చేసింది. చైనా పై కోపంతో జనం దీన్ని బాగా డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఈ యాప్ కు అనుహ్య ప్రజాదరణ లభిస్తోంది. ఎంతగానంట.. కేవలం 72 గంటల్లోనే దాదాపు 5 లక్షల మంది ఈ యప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారట.

 

 

ఈ యాప్ ను బెంగుళూరుకు చెందిన బిస్వాత్మా‌, సిద్ధార్థ్‌లు రూపొందించారు. జూన్‌ 10 నాటికి ఈ యాప్‌ను లక్షమందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకుంట.. గల్వాన్‌ ఘటన జరిగిన జూన్‌ 15 తర్వాత డౌన్‌లోడ్లు భారీగా పెరుగుతున్నాయి. ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ కూడా ఉంది. దీనిలో అప్‌లోడ్‌ చేసిన వీడియోలకు వీక్షకుల సంఖ్య ఆధారంగా పాయింట్లు కేటాయిస్తామని దాని ప్రకారం డబ్బు కూడా సంపాదించొచ్చట. ఇంకేం మీరూ ట్రై చేయండి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: