దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత వినే ఉంటారు.. అంటే ఏదైనా నాలుగు రాళ్ళు ఉన్నప్పుడే వాటిని పెంచుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు.. అదేంటంటే.. డబ్బులు ఉన్నప్పుడు కొత్త బిజినెస్ లు చేయాలని కొందరు తెగ ఆలోచిస్తుంటారు.. అలాంటి వాళ్ళు ఎటువంటి వాటిలో ఇన్వెష్ట్ చేయాలి అని తెలియక తికమక పడుతుంటారు.. అలాంటి వారి కోసం ఈ ఐదు అదిరిపోయే స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయంటున్నారు ప్రముఖలు అవేంటో ఇప్పుడు చూద్దాం..



రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడేవారు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టొచ్చు. లేదంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.చాలా మంది రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. అందుకే ఇప్పుడు అధిక రాబడి అందించే టాప్ 5 స్కీమ్స్ ఏంటివో తెలుసుకుందాం.వీటిల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల మంచి రాబడి పొందొచ్చు. ఇది సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. వడ్డీ డబ్బులను మూడు నెలలకు ఒకసారి పొందొచ్చు... వీటి మీద వడ్డీ 7.4 శాతం వడ్డీ వస్తోంది. స్కీమ్ మెచ్యూరిటీ కాలం దాదాపు ఐదేళ్ల పూర్తవ్వాలట..



పోస్టాఫీసు లో మంత్లీ స్కీమ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..ఈ స్కీమ్‌లో కూడా డబ్బులు పెట్టొచ్చు. స్థిర ఆదాయం పొందాలని భావించే వారు ఈ పథకంలో డబ్బులు పెట్టొచ్చు. కనీసం రూ.1,000 ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు.. ఇకపోతే జాయింట్ అకౌంట్ లో ఇన్వెష్ట్ చేయాలని అనుకునేవారు 9 లక్షలు ఇన్వెష్ట్ చేస్తే మంచిదని అంటున్నారు..ఆర్‌బీఐ బాండ్లలో కూడా డబ్బులు పెట్టొచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు. ఇంకా కార్పొరెట్ సంస్థలు అందించే డిపాజిట్ స్కీమ్స్‌లో కూడా మీ డబ్బులు దాచుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు ఈ స్కీమ్‌లను అందిస్తాయి.. మరో విషయమేంటంటే ట్యాక్స్ ఫ్రీ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.. ఈ స్కీమ్ కు అన్నీ కూడా లాభాలను తెచ్చి పెట్టేవే ..


మరింత సమాచారం తెలుసుకోండి: