రుణం పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటు లో ఉంది. సులభంగానే రుణం పొందే వెసులుబాటు ఒకటుంది. మీరు పేటీఎం కస్టమర్ అయ్యి ఉండాలి. మీరు పేటీఎం ఉపయోగిస్తూ ఉంటే.. వెంటనే రూ.2 లక్షల వరకు రుణం పొందొచ్చు.
ఎలా అని అనుకుంటున్నారా? పేటీఎం కొన్ని నెలల కిందట ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ సర్వీసులు అందుబాటు లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మీరు వేగంగానే లోన్ పొందొచ్చు. పేటీఎం లోన్ సర్వీసుల కోసం ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులతో జతకట్టింది.
ఈ పెటీఎం ద్వారా ఉద్యోగం చేసేవారికి స్వయం ఉపాధి పొందుతున్న వారు, బిజినెస్ చేసే వారు లోన్ పొందొచ్చు. రూ.2 లక్షల వరకు రుణం వస్తుంది. ఇందుకోసం ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు లేదు..ఆన్‌లైన్‌లోనే పూర్తి ప్రక్రియ ఉంటుంది. అయితే క్రెడిట్ స్కోర్ బాగుంటేనే లోన్ వస్తుంది.
తీసుకున్న రుణాన్ని 18 నుంచి 36 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మీరు కూడా లోన్ పొందాలని భావిస్తే.. పేటీఎం యాప్‌లో ఉన్న ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ పర్సనల్ లోన్ ట్యాబ్ ఉంటుంది. అక్కడ అప్లై చేస్తే లోన్ వస్తుంది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే అర్హత ఉంటే లోన్ వస్తుంది.. లేకుంటే లేదు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి