ప్రతి ఒక్కరికి వ్యాపారం చేయాలి ..డబ్బు ఆదా చేయాలి.. అనే ఆలోచన తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే అలాంటి ఆలోచనతో ముందుకు వెళ్లాలి అని ఆలోచిస్తున్నారో, అలాంటి వారికి ఇప్పుడు కొన్ని సరికొత్త వ్యాపార ఆలోచనలను ముందుకు తీసుకు వచ్చాము. ఇవి కచ్చితంగా మీకు లాభాన్ని అందిస్తాయని మేము ఆశిస్తున్నాము. అయితే వీటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

1. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సెంటర్ బిజినెస్ :
మరీ ముఖ్యంగా ఇటీవలకాలంలో ఆడవాళ్లు చీరకు పెట్టిన రేటు కంటే రెట్టింపు స్థాయిలో బ్లౌజ్ కుట్టించు కోవడానికి డబ్బు పెడుతున్నారు. అయితే ఎక్కువగా ఒక బ్లౌజ్ కు ఎంబ్రాయిడింగ్ వేయాలి అంటే ఒక మనిషికి ఒకరోజు పడుతుంది. కానీ ఈ ఎంబ్రాయిడరీ మిషన్ వల్ల కేవలం అరగంట సమయం లోనే కావలసిన డిజైన్ వేసి ఇవ్వొచ్చు. ఇక దీనికి భారీ డిమాండ్ వుంది. ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం. అంతేకాదు ఒక్కొక్క డిజైన్ కి సుమారుగా రూ.1000 నుంచి 2000 రూపాయల వరకు తీసుకుంటున్నారు.

2. సెల్ఫ్ అడెసివ్ టేప్స్ :
ఈ టేప్స్ ప్రతి ఒక్కరికి , తమ నిత్య జీవితంలో ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా వస్తువును ప్యాకింగ్ చేయడానికి లేదా కరెంటు కేబుల్ ను జాయింట్ చేయడానికి ఈ టేప్స్  ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతి ఒక్కరికి తప్పకుండా అవసరమయ్యే ఈ టేప్స్ వ్యాపారం తప్పకుండా లాభాన్ని అందిస్తుంది. ఇక ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఈ వ్యాపారం చేయడం వల్ల అందరికీ ఎక్కువ స్థాయిలో లాభాలు వస్తాయి. ఇక దీనికి మార్కెటింగ్ కి  కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.

3. డైనింగ్ టేబుల్ పేపర్ రోల్స్:
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి కల సొంత ఇల్లు . సొంత ఇల్లు లో రకరకాల వస్తువులను ఏర్పాటు చేసుకోవాలని చూస్తారు. అందులో డైనింగ్ టేబుల్ కూడా ఒకటి. ఇక ఈ  డైనింగ్ టేబుల్ పై ఉపయోగించే పేపర్లకు  కూడా ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. అంతేకాదు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో వచ్చే ఈ పేపర్స్, అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి . కాబట్టి చాలా లాభాన్ని అందిస్తుంది ఈ వ్యాపారం.


మరింత సమాచారం తెలుసుకోండి: