బీహార్ లో దొంగ బ్యాంకు ఖాతాల స్కాం వెలుగుచూస్తోంది. అక్కడి ప్రజలకు బ్యాంకు ఖాతాలు ఉండవు, కానీ వాళ్ళ అకౌంట్ లలో కోట్లకు  డబ్బు మాత్రం ఉంటుంది. ఇలాంటి ఘటనలు తాజాగా బీహార్ లో తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలు ఏదో ఒక పని మీద ఆయా బ్యాంకులకు వెళ్తుండటం కొత్తగా ఖాతా తెరవాలని అక్కడ అధికారులను కోరటం, ఆ బ్యాంకులో అతని పేరుమీద అప్పటికే ఒక అకౌంట్ ఉండటం, అందులో కోట్ల డబ్బు ఉందని బ్యాంకు వారు చెప్పడం విన్న ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనితో బ్యాంకు వారు ఆయా ఖాతాలను నిలిపివేస్తూ అందులో నగదును ఫ్రీజ్ చేస్తున్నారు.

ఇటీవల సుపాల్ టౌన్ కు చెందిన విపిన్ చౌహన్ జాబ్ కార్డు కోసం స్థానికంగా ఉన్న బ్యాంకుకు వెళ్ళాడు. విపిన్ స్థానికంగా కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బ్యాంకుకు వెళ్లిన అతడు వాళ్ళు అడిగిన సమాచారం చెప్పగానే అతని పేరుమీద ఇదివరకే ఒక ఖాతా ఉందని వాళ్ళు నిర్దారించారు. అందులో దాదాపు పది కోట్ల డిపాజిట్ కూడా ఉన్నట్టు చూసి అందరు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే విపిన్ సంబంధిత బ్యాంకు కార్యాలయానికి వెళ్లి వివరాలు సేకరించగా ఆతడి ఆధార్ కార్డు తో 2016లో ఖాతా తెరిచినట్టు తెలుసుకున్నాడు. అలాగే 2017లో ఆ ఖాతాలో కోట్ల డబ్బు డిపాజిట్ చేయబడిందని తెలుసుకున్నాడు.

ఈ విధంగా కేవలం ఒక వ్యక్తి ఆధార్ కార్డు వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరుస్తుండటం పట్ల దీనివెనుక పెద్ద స్కాం ఉందనే అనుమానాలు వస్తున్నాయి. ఇక ఇలాంటి ఘటనలు బీహార్ లో తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి బ్యాంకుల నిర్లక్ష్యంతో ఐదు లక్షలు వేరే ఖాతాలో జమ అయ్యాయి. అవి అతడు ప్రభుత్వం ఇచ్చిందేమో అని ఖర్చుకూడా చేసేశాడు. చేసేది లేక బ్యాంకు మేనేజర్ పోలీసులను ఆశ్రయించాడు.  అలాగే మరో సందర్భంలో విద్యార్థుల ఖాతాలలో 900 కోట్లు జమ అయినట్టు చూపించిన ఘటన కూడా జరిగింది. అయితే అవన్నీ సాధారణంగా తలెత్తే సాంకేతిక సమస్యలు అనుకుంటే, మరి కేవలం వ్యక్తి ఆధార్ తో అకౌంట్ ఓపెన్ చేయడం ఎవరి తప్పు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: