చెన్నై, ముంబయి, బెంగళూరు తో పాటు బెల్జియం, ఫ్రాన్స్ దేశాలకు ఎగుమతి చేస్తుంది. నాలుగేళ్ల క్రిితం కోకో సాగు 4 వేల ఎకరాల్లో సాగయ్యేది. ప్రస్తుతం ఇది 40 వేల హెక్టార్లకు విస్తరించింది. ఏటా 38 వేల టన్నుల కాయల దిగుబడి వస్తుంది. వాటి నుంచి 11 వేల టన్నుల గింజలు వస్తాయి. వీటిల్లో 80 శాతం క్యార్బరీ, లోటస్ నెస్లే లాంటి కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి.
సాధారణంగా గుజ్జుతో కూడిన గింజలను ఒకటి, రెండు రోజులు ఎండబెట్టి వాటిని కిలోల చొప్పున కూడా అమ్మేస్తున్నారు. వీటికి కిలో 180 రూపాయల నుంచి 200 వరకు ఆయా కంపెనీలు చెల్లించి తీసుకుంటాయి. ప్రస్తుతం ప్రీమియం చాక్లెట్లు తయారీ చేసే ఉత్పత్తులపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ఏపీ ఫుడ్ ఫ్రాసెసింగ్ సొసైటీ ద్వారా 35 శాతం సబ్సిడీ మీద 28 లక్షల ఆర్థిక సాయం ఇస్తున్నారు. బాక్స్ పర్మినెంటేషన్ మీద శిక్షణ ఇస్తున్నారు.
ఫైలెట్ ప్రాజెక్టు కృష్ణా జిల్లా నూజివీడు మండలం తడికలపూడిలోని సాయిరాం ఫుడ్స్ అండ్ బేవరేజీ మీద ఆర్థిక సాయం అందిస్తే ఏడాదిలో 25 టన్నుల ప్రీమియం కోకో గింజలను ముంబయి కి ఎగుమతి చేశారు. అయితే కంపెనీ పరిధిలోని రైతులకు కిలోకు అదనంగా రూ. 80 వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఇది రాబోయే రోజుల్లో మంచి ఉపాధి కాపాబోతుంది. అయితే నూతన పంటల వైపు రైతులను ప్రోత్సహించి వారి రాయితీలు ఇస్తే మరింత ముందుకు వెళతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి