ఒకప్పుడు ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే బ్యాంకు బేరర్ చెక్ ఇచ్చే వాళ్లం. కానీ, నేడు దాదాపుగా అందరమూ నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేస్తున్నాం. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ మనీ ట్రాన్స్ ఫర్ సమయాల్లో ఒక్క డిజిట్ తేడా వచ్చినా నగదు వేరే వారి ఖాతాకు బదిలీ అయిపోతుంది. ఒకవేళ వేరే ఖాతాకు బదిలీ అయిపోతే పరిస్థితి ఏంటి? మన నగదు వెనక్కి వస్తుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?