బీట్ రూట్ అంటే చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే ఈ కూర తినడానికి కొద్దిగా తియ్యగా ఉండడం వలన చాలా మంది ఇష్టంగా తినరు. అయితే మేము చెప్పే విధంగా బీట్ రూట్ కర్రీ ఇలా చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా కొబ్బరితో బీట్ రూట్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా.

కావలసిన పదార్ధాలు :

బీట్ రూట్ -1/4 kg
కొబ్బరి తురుము  1/2 కప్పు
ఎండు మిరపకాయలు -2
మినపప్పు -1 స్పూన్
ఆవాలు -1 స్పూన్
పచ్చిమిర్చి-2                                                              
జీలకర్ర -1 స్పూన్
కరివేపాకు,
ఇంగువ -కొద్దిగా
పసుపు -1/4 స్పూన్
ఉప్పు -1/2 స్పూన్
చాట్ మసాలా - 1/4 స్పూన్
నూనె  -  కొద్దిగా
నిమ్మరసం  -  2 స్పూన్
కొత్తిమీర -కొద్దిగా

 తయరు చేసుకునే విధానం :

ముందుగా బీట్ రూట్  తోక్కతిసి చిన్నసైజులో ముక్కలుగా తరుగుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేసాక తిరగమాత కోసం ఉంచుకున్న మినపప్పు , ఆవాలు,  జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ చివరగా కరివేపాకు వేసి వేపాలి. ఆ తరువాత పచ్చిమిర్చి ముక్కలు,  బీట్ రూట్ ముక్కలు వేసి మూతపెట్టి చిన్న మంటపై  10 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వేపాలి.దుంప ముక్కలు వేగిన తరువాత  అందులో కొబ్బరి తురుము వేసి కొద్దిగా వేయించాలి.కొబ్బరి తురుము ఎక్కువ సేపు వేయిస్తే రుచి పోతుంది.కొబ్బరి తురుము వేసాక 2,3 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి  చాట్ మసాలా చల్లాలి. ఆ తరువాత కొద్దిగా నిమ్మరసం కూర పైన చల్లాలి. చివరలో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: