చికెన్ లో తంగిడి కబాబ్ అంటే చాలా మందికి ఇష్టం. చాలా మందికి అవి వర్షం పడినప్పుడు తినడం చాలా ఇష్టం.చీజ్ లో ముంచుకుని తింటూ ఉంటారు చాలా మంది. చాలా మందికి అవి స్నాక్స్ గా కూడా ఇష్టం. చిన్న పిల్లలు కూడా వాటిని చాలా  ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే అవి ఇంట్లో చేసుకోవడం చాలా మందికి రాదు. కాబట్టి ఇప్పుడు అవి ఎలాగో మీకు చెప్తాను.

 ఎం కావాలంటే... చికెన్‌ డ్రమ్‌ స్టిక్స్‌ - అర కిలో, పెరుగు - ఒక కప్పు కావాలి. అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌ స్పూన్‌ కావాలి. ఉప్పు - రుచికి తగినంత వేయండి. కారం - ఒక టీ స్పూన్‌ కావాలి. గరం మసాలా - ఒక టీ స్పూన్‌, ధనియాల పొడి కావాలి. ఒక టీ స్పూన్‌, పచ్చి మిర్చి – నాలుగు కావాలి. కొత్తి మీర - ఒక కట్ట కావాలి. నిమ్మకాయ ఒకటి కావాలి. ఉల్లిపాయలు – రెండు కావాలి.

తయారీ విధానం ఒక పాత్రలో చికెన్‌ డ్రమ్‌ స్టిక్స్‌ తీసుకుని పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. అలాగే  ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేయాలి. తరిగిన పచ్చి మిర్చి, కొత్తిమీర తురుము వేసి బాగా కలపాలి. అలాగే నాలుగైదు గంటల పాటు పక్కన పెట్టండి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్‌ డ్రమ్‌ స్టిక్స్‌ ను నెమ్మదిగా పేర్చినట్టుగా పెట్టండి. మూత పెట్టి పెద్ద మంటపై ఐదు నిమిషాలు ఉడికించండి. ఆ తరువాత మూత తీసి డ్రమ్‌ స్టిక్స్‌ను తిప్పి మరో మూడు నిమిషాల పాటు ఉడికించండి. చివరగా నిమ్మ రసం పిండుకుని, ఉల్లిపాయలతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకుంటే చాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: