ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. సొరకాయతో గుమ గుమ లాడే పాయసాన్ని కూడా చేసుకోవచ్చు. ఈ పాయసాన్ని చాలా తేలికగా  తీపి పదార్ధంగా చేసుకోవచ్చు. సొరకాయ అలాగే పాలతో తయారుచేసే ఈ రెసిపీ ఒక తియ్యటి జున్ను ను పోలి ఉండి నోరూరించే  రుచిని కలిగి ఉంటుంది. ఈ సొరకాయ పాయసాన్ని సాంప్రదాయక వ్రతాలు లేదా ఉపవాసాల రోజులలో, ముఖ్యంగా నవరాత్రి సమయంలో ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంటుంది. ఈ రెసిపీకి ప్రత్యేకమైన సన్నాహక విధానాలు అంటూ అవసరం ఉండదు. ఇక  దీన్ని తయారు చేయడం చాలా సులభం కూడా. ఈ రుచికరమైన సొరకాయ పాయసం చాలా సులభంగా అలాగే చాలా తేలికగా జీర్ణమవుతుంది కూడా. కావున, ఈ రెసిపీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వ్యాసంలో చదవండి...

సొరకాయ పాయసానికి కావాల్సిన పదార్ధాలు...

1 కప్ తురిమిన సొరకాయ....
1/4 కప్ చక్కర....
2 టీ స్పూన్ ఖోయ....
1 టీ స్పూన్ నెయ్యి....
పొడిగా చేసిన యాలకులు....
1 టీ స్పూన్ చిరౌంజి/ సార పప్పు....
అవసరాన్ని బట్టి బాదం.....
అవసరాన్ని బట్టి ముక్కలుగాా కోసిన పిస్తా పప్పు....

గుమ గుమ లాడే సొరకాయ పాయసం తయారు చేయు విధానం....

ఒక బాణలిలో 2 టీస్పూన్ల నెయ్యి వేసి, అందులో తాజాగా తురిమిన సొరకాయను వేసి 2 నుండి3 నిమిషాలు వేయించాలి. సొరకాయను మెత్తగా తురిమిన తరువాత, దాని నుండి అదనపు నీటిని తొలగించడం ముఖ్యం.ఇప్పుడు, ఆ బాణలిలో పాలు వేసి మరిగించాలి. పాలు చిక్కగా మారుతున్న సమయంలో, అందులోచక్కెర వేసి 2 నిమిషాలు ఉడికించాలి.

ఆపై అందులో కోవా వేసి 2 నిమిషాలు ఉడికించాలి. సారపప్పు, బాదం, యాలకుల పొడి మరియు పిస్తా వేసి మందపాటిగా వచ్చేవరకు 5 నిమిషాలపాటు ఉడికించాలి.మంటను ఆపివేసి, మీకు నచ్చిన విధంగా, వేడి లేదా చల్లగా ఈ రెసిపీని హ్యాపీగా ఆనందిస్తూ తినండి.. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: