ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....చేపకూర ఎంత రుచికరంగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. చేప ముక్క కొరుకుతుంటే ఆ రుచికి ప్రాణం జివ్వుమంటుంది. మాంసాహారి అన్నాక చేప తిని తీరాల్సిందే. అంత బాగుంటుంది. ఇది రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఫిష్ కర్రీని రెగ్యులర్ గా కాకుండా కొబ్బరి పాలతో చేసుకోండి. ఆ రుచిని మీరు జన్మలో మరచిపోలేరు. మరి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఆ రెసిపీ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందామా!

ముందుగా కావాల్సిన పదార్ధాలు....  చేపముక్కలు - 8, ఉల్లిపాయ పేస్ట్‌ - 4 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌-4స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్‌- 4స్పూన్లు, జీలకర్ర పొడి- 4 స్పూన్లు, కారం పొడి- 4 స్పూన్లు, పసుపు పొడి- 2 స్పూన్లు, గరం మసాలా పొడి- టీ స్పూన్‌, జీలకర్ర- 2 స్పూన్లు, కొబ్బరి పాలు- రెండు కప్పులు, నూనె- 4 స్పూన్లు, ఉప్పు- సరిపడా.

కొబ్బరి పాలతో చేప కూర తయారు చేయు విధానం....మొదటగా చేప ముక్కలకు కొద్దిగా పసుపు, ఉప్పు పట్టించి అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత చేప ముక్కలను నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి.అయితే ముక్కలను మరీ ఎక్కువగా వేయించకూడదు. ఫ్రై చేసిన తర్వాత... చేపముక్కలను మరో ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.అదే పాత్రలో... మరికొంచెం.. నూనె వేసి కాగిన తర్వాత... జీలకర్ర, బిర్యానీ అకు వేసి నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్‌ కూడా వేసి బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే జీలకర్ర పొడి, కారం, వేసి కాసేపు వేయించాలి.కొద్దిసేపటి తర్వాత... కొబ్బరి పాలను తీసుకొని... ఆ మిశ్రమంలో పోస్తూ... కలుపుతూ ఉండాలి. ఇప్పడు అందులో చేప ముక్కలు వేసి... చిన్నగా కలపాలి... తగినంత ఉప్పువేసి... చేపముక్కలు పూర్తిగా ఉడికే వరకూ సన్నని మంట మీద ఉడికించుకోవాలి.చివరిగా అందులో గరం మసాలా పొడి వేసి, కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేయాలి. 10 నిమిషాలు అలాగే ఉంచి... స్టౌ మీద నుంచి దించుకోవాలి. ఇక మీకు... కొబ్బ‌రి పాల‌తో 'ఫిష్' క‌ర్రీ రెడీ అయినట్లే. అన్నంతో తింటే దీని రుచి ని వర్ణించలేము. అంత రుచిగా  ఉంటుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: