ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సాయంత్రం వేళ చిరు తిండిగా తినడానికి మిర్చి బజ్జీ మంచి స్నాక్ గా ఉంటుంది.... వర్షాకాలం వచ్చిందంటే బజ్జీలు చేసుకుని తినేవాళ్లు చాలా ఎక్కువ మంది వుంటారు. మాములుగా బజ్జి అంటే చాలా మంది సెనగ పిండితో తయారు చేసుకొని తింటారు. కాని ఎప్పుడు శెనగపిండితో చేసిన బజ్జీనే కాదు, చికెన్ తో కూడా మిర్చి బజ్జీ చేసుకోవచ్చు.ఇక చికెన్ తో బజ్జి చేసుకొని తింటే ఆ రుచే వేరు. ఆ రుచిని మనం మాటల్లో వర్ణించలేము. ఇక ఈ రుచికరమైన చికెన్ బజ్జిని ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...

చికెన్ బజ్జి తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు...

బోన్ లెస్ చికెన్ - పావుకిలో,
మిరప కాయలు - 8,
కొత్తి మీర తరుగు - ఒక టీస్పూను,
పసుపు - చిటికెడు,
కారం - ఒక టీస్పూను,
మైదా - కప్పు,
ఉల్లిపాయ తరుగు - రెండు టేబుల్ స్పూనులు,
నూనె - తగినంత,
ఉప్పు - రుచికి సరిపడా

చికెన్ బజ్జి ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

ముందుగా చికెన్ ను మంచి ఖీమాలా కొట్టించాలి. ఇప్పుడు స్టవ్ కుక్కర్ పెట్టి కాస్త నూనె వేసి ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి. కాస్త పసుపు, గరం మసాలా, కారం, వేసి కలపాలి. ఇప్పుడు చికెన్ కూడా వేసి బాగా కలపాలి. అందులో తురిమిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి వేయించాలి. బాగా వేగాక కొద్దిగా నీరుపోయాలి. కుక్కర్ పై మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు మైదాని ఒక గిన్నెలో వేసుకుని అర టీస్పూను ఉప్పు వేయాలి. కాస్త నీళ్లు వేసి బాగా కలిపి పూరీ ఉండలు చుట్టుకోవాలి. పూరీలకు చుట్టుకునేట్టు పెద్దవి కాకుండా... కాస్త చిన్నవి చుట్టుకోవాలి. వాటిని పూరీల్లా ఒత్తుకోవాలి. బజ్జీ మిర్చీలకు మధ్యలో గాటు పెట్టి... చికెన్ మిశ్రమాన్ని కూరాలి. ఆ మిర్చి చుట్టు ఒత్తుకున్న పూరీని చుట్టేసి చివర్లు నొక్కేయాలి. వాటిని నూనెలో వేయించాలి. అంతే చికెన్ మిర్చీ బజ్జీ తయారైనట్టే. నాన్ వెజ్ ప్రియులకు ఈ చికెన్ బజ్జీ భలే రుచిగా ఉంటుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: