ఇంట్లో ఒంటరిగా ఉన్నా లేదా కుటుంబంతో కలిసి పార్టీ మూడ్‌లో ఉన్నా.... పనీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుని మధ్యాహ్నం లంచ్ లేదా నైట్ డిన్నర్ లోనూ స్పెషల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఈజీగా ఇంటిలోనే టేస్టీ పనీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసి మీ కుటుంబంతో మధురమైన లంచ్ టైం ను మరింత ప్రత్యేకంగా చేసుకోవచ్చు. పనీర్ ఫ్రైడ్ రైస్ డిష్‌తో సహా పనీర్ తో అనేక రుచికరమైన ఆహారాలను తయారు చేయవచ్చు. ఇందులో మీకు పనీర్, అన్నం, ఉప్పు, కారం, కొంత సమయం అవసరం. మీరు పనీర్ ఫ్రైడ్ రైస్‌ను సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయవచ్చు. అంతే కాదు ఎక్కడికైనా బయటకు వెళ్లాల్సి వస్తే తయారు చేసి మీతో పాటు తీసుకెళ్లొచ్చు. పిక్నిక్ లేదా చిన్న చిన్న ట్రిప్, ఇంకా ఆఫీస్, స్కూల్ ఇలా ఎక్కడికెళ్లినా పనీర్ ఫ్రైడ్ రైస్ ను తీసుకుని వెళ్లొచ్చు. ఆ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :
1 కప్పు ఉడకబెట్టిన అన్నం
1/2 tsp ఎర్ర మిరప పొడి
1/2 tsp నల్ల మిరియాలు
కొద్దిగా క్యారెట్
1 క్యాప్సికమ్
200 గ్రా పనీర్ ముక్కలు
అల్లం వెల్లుల్లి పేస్ట్
కొద్దిగా సోయా సాస్
1 ఉల్లిపాయ
ఉప్పు రుచికి సరిపడా

వంటకం తయారీ
ముందుగా బియ్యాన్ని ఉడకబెట్టండి. దీని కోసం ఒక పాత్రలో ఒకటిన్నర కప్పుల నీటిని తీసుకొని దానికి 1 కప్పు బియ్యం వేయండి. అన్నం ఉడుకుతున్నప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేయండి

స్టెప్ 2 :
బాణలిలో నూనె తీసుకుని అందులో పనీర్ ముక్కలను వేయించాలి. ఇప్పుడు మరో కడాయిలో నూనె వేసి వేడయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దీనితో పాటు వేయించిన పనీర్ ముక్కలను అందులో వేయాలి. అన్ని కూరగాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్ వేసి ఉడికించాలి. రుచికి తగ్గట్టుగా కారం, నల్ల మిరియాలు, ఉప్పు వేయండి. చివరగా ఉడికించిన అన్నం వేసి తేలికగా డిష్ ను కదిలించండి. మీ వంటకం కొద్దిసేపటిలో రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక పాత్రలో వేడిగా సర్వ్ చేయండి విత్ టేస్టీ గ్రీన్ చట్నీ లేదా టమాటో సాస్ తో... అంతే టేస్టీ పనీర్ ఫ్రైడ్ రైస్ రెడీ.


మరింత సమాచారం తెలుసుకోండి: