గుడివాడలో గంజాయి దందాని పోలీసులు పట్టుకున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ దందాని పోలీసులు కనిపెట్టి  చేధించారు . ఆ తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.  పూర్తి వివరాల్లోకి వెళితే...  కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతంలో గంజాయి వ్యాపారం గుట్టు బయట పడింది. ఈ ముఠాని సీఐ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన గోవింద రాజులు పట్టుకున్నారు. చిన్న చిన్న క్లూస్ తో  మొత్తం దందా గురించి తెలుసుకున్నారు. పట్నంలో రాజేంద్ర నగర్ లో ఒక కార్పొరేట్ స్కూల్ ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టు పెట్టుకున్న తండ్రి కొడుకులు కొంత కాలంగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. 

 

ఏకంగా దీనిని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీఐ గోవింద రాజులుకి సమాచారం రావడంతో దీనిపై విచారణ చేశారు. అయితే మొత్తం మీదకి 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మొత్తం గంజాయి సరఫరా చేసే వాళ్ళు గంజాయి కొనుగోలు చేసే వాళ్ళు ఇందులో ఉన్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ విషయం బయట పడగానే ఇద్దరు ప్రముఖులు  పోలీసు ఉన్నతాధికారులుకి ఫోన్ చేసి కేసులు పెట్టొద్దు అని ఒత్తిడి చేశారట.  అయితే ఈ ముఠా వెనక ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

 

గుడివాడకు విశాఖ మన్యం నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం పై ఇద్దరు ప్రముఖులు అనేక మార్లు పోలీసులకు ఫోన్ చేసి కేసులు పెట్టొద్దని  చెప్పడం తో ఒత్తిడి ఏర్పడింది. గుడివాడ నుంచి అక్కడికి వెళ్ళి స్థిరపడిన కొందరు వ్యక్తులు ఈ దందాలు నిర్వహిస్తున్నట్లు అర్థమవుతోంది అన్నారు పోలీసులు.  అయితే ఈ గంజాయి విక్రయించే వారిని విచారిస్తే విషయాలన్నీ బయట పడతాయని పోలీసుల అభిప్రాయపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: