సంక్రాంతి పండగంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రత్యేకం.. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, కొత్త అల్లుల్లు, కోడిపందేలతో ఈ రెండు రాష్ట్రాలు కళకళలాడుతాయి. అందులోనూ ఈ సంక్రాంతి పండగను ప్రజలు బాగా సెలబ్రేట్ చేసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. కొందరైతే ప్రతి పండగకు పక్కాగా బట్టలు కొనుక్కోవల్సిందేనని పట్టుబడి కూర్చుంటారు. చిన్నవారి నుంచి పెద్ద వారి వారకు కొత్త బట్టలు కొనాలని ఆశపడతుంటారు. ఈ బట్టలపై అమితమైన ప్రేమ చూపించేది మాత్రం ఖచ్చితంగా ఆడవారేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  బట్టలు గనుక ఇప్పించకపోతే గొడవ కూడా సిద్ధమవుతుంటారు. 

వారికి ఉన్నంత స్థాయిలో నైనా  ఖచ్చితంగా కొనక్కోవల్సిందేనని పట్టుబడుతుంటారు కొందరు మహిళలు. అయితే సంక్రాంతి పండగకు తన భర్త బట్టలు కొనియ్యలేదనే మనస్తాపంతో ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన శ్రీకాకులం జిల్లాలో జరిగింది. జిల్లాలోని నేరడి బికి లో అప్పన్న అతని భార్య.. వాళ్ల ఇద్దరి పిల్లలతో  నివసిస్తుండేవారు. కాగా అప్పన్న భార్య శనివారం రాత్రి సమయంలో పురుగుల మందు తాగింది. దాంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దాన్ని గమనించిన కుంటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఆమెను టెస్ట్ చేసిన డాక్టర్లు ఆమె కండీషన్ క్రిటికల్ గా ఉందని చెప్పి.. మెరుగైన చికిత్స కోసం ఆమెను శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. దాంతో ఆ వివాహితను రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ఆమె పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆమె చికిత్స పొందుతూనే కన్నుమూసింది. అయితే సంక్రాంతి పండగకు తన అల్లుడు కొత్త బట్టలు కొనియ్యలేదనే తన కూతురు మనస్తాపం చెంది పురుగుల మందు తాగి చనిపోయిందని మృతురాలి తండ్రి అప్పన్నపై పోలీసుకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారని ఎస్ఐ కరణం వెంకటసురేశ్ వెళ్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: