శివాజీ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే మరణించాడు. ప్రకాష్, సుబ్రహ్మణ్యంలను మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. అయితే తిరుపతి వెళ్తున్న మార్గంలోనే సుబ్రహ్మణ్యం కూడా మృతి చెందాడు. చిన్ననాటి నుండి కలిసి పెరిగిన ఇద్దరు స్నేహితులు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదలడంతో అందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు శివాజికి భార్య, 3 నెలల కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.
ఇదిలా ఉండగా ప్రతీ సంవత్సరం దేశంలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అతివేగం, రాష్ డ్రైవింగ్ తో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క 2019 లోనే ఇలా రోడ్డు ప్రమాదాల కారణంగా మృత్యువాత పడిన వారి సంఖ్య 1, 54, 732గా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2019లో దేశ వ్యాప్తంగా 4, 37, 396 యాక్సిడెంట్లు జరిగాయి. వీటిల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే 2,60,379 యాక్సిడెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 1,77,017 ప్రమాదాలు జరిగినట్లు తెలిపింది. ఇందులో 1,30,943 యాక్సిడెంట్లు రెసిడెన్షియల్ ఏరియాల్లో అయ్యాయి. ఓవర్ స్పీడ్ కారణంగానే 59.6 శాతం యాక్సిడెంట్స్ జరగగా అందులో 86,241 మంది చనిపోయారు. మరో 2,71,581 మంది వాహనదారులు గాయపడ్డారు. డేంజరస్ డ్రైవింగ్ కారణంగా జరిగిన ప్రమాదాల్లో 42,557 మంది చనిపోయారు. 1,06,555 మంది గాయపడ్డారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి