రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన విశాఖ‌ప‌ట్నం మ‌దురవాడ మిథిలాపురి వుడా కాల‌నీలో బంగారు నాయుడు కుటుంబం మ‌రాణాల కేసులో మిస్టరీ కొన‌సాగుతుంది. ఏసీపీ కుమార‌స్వామి నేతృత్వంలో పీఎం పాలెం సీఐ ర‌వికుమార్ ద‌ర్యాప్తు చేస్తున్నారు. శుక్ర‌వారం పోస్ట్మార్టం అనంత‌రం మృత‌దేహాల‌ను సొంత గ్రామం విజ‌య‌న‌గ‌రం గంట్యాడ గ్రామానికి త‌ర‌లించారు. బంగారునాయుడు విదేశాల్లో కోట్ల ఆస్తులు సంపాదించి నాలుగేళ్ల క్రితం విశాక‌ప‌ట్నానికి వ‌చ్చారు. ఆయ‌న బ‌హ్రెయిన్ లో కింగ్ ద‌గ్గ‌ర ఉద్యోగం తో పాటు పెట్రోల్ వ్యాపారంలో కూడా పెట్టుబ‌డులు పెట్టారు. బంగారు నాయుడికి హైద‌రాబాద్ విశాక‌పట్నంలో కోట్ల రూపాయ‌ల స్తిరాస్తులు ఉన్నాయి. ఈ నేప‌థ్య‌లో ఆస్తుల సంబంధించిన వివాదాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచార‌ణ జ‌రుపుతున్నారు. అంతే కాకుండా బంగారు నాయుడు కు బ‌హ్రెయిన్ లో వ్యాపారంలో ఏమైనా వివాదాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా విచార‌ణ జ‌రుపుతున్నారు. మ‌రోవైపు కుటుంబ స‌భ్యులు సైతం బంగారు నాయుడు కొడుకు దీప‌క్ మ‌ర‌ణాల‌కు కార‌ణం అన‌డాన్ని కండిస్తున్నారు. 

దీప‌క్ ఉన్న‌త చ‌దువులు చ‌దువుతున్నాడ‌ని అత‌డిపై మాన‌సిక రోగి అనే ముద్ర వేయ‌వ‌ద్ద‌ని అంటున్నారు. బంగారు నాయుడు అప్ప‌ల రాజు మాట్లాడుతూ..త‌మ తండ్రి శ్రీరాములు డీసీఎం ప్రెసిడెంట్ గా 15 ఏళ్లు ప‌నిచేశారని త‌మ‌ది ఉన్న‌తంగా స్థిర ప‌డిన కుటుంబ‌మ‌ని అన్నారు. బంగారు నాయుడు ఐద‌వ‌త‌ర‌గ‌తి వ‌ర‌కు సొంత గ్రామంలో చ‌దువుకున్నార‌ని ఆ త‌ర‌వాత న‌గ‌రంలో చ‌దువుకున్నార‌ని చెప్పారు. తెలుగు విశ్వ‌విద్యాల‌యంలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశార‌ని తెలిపారు. ఆ త‌రవాత గ‌ల్ఫ్ వెళ్లి ఉద్యోగం చేశారని తెలిపారు. విదేశాల నుండి తిరిగి వ‌చ్చిన త‌ర‌వాత ఆయ‌న విశాఖ లోని ఓ పరిశ్ర‌మ‌లో ఉద్యోగం చేశార‌ని తెలిపారు. ఆ త‌ర‌వాత విశాక‌ప‌ట్నం విజ‌య‌న‌రం జిల్లాల‌లోని ప‌లు కాలేజిల్లో విద్యాభోద‌న చేశారని తెలిపారు. మృత దేహాల‌పై క‌త్తి గాట్లు ఉన్నాయ‌ని వాటిని చూస్తుంటే ఎవ‌రో ప్రొఫెష‌న‌ల్ కిల్లర్స్ ఈ హ‌త్య చేశార‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: