ఒకవైపు కరోనా మహమ్మరి విజ్రుంభిస్తున్న కూడా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యభిచారం మరియు క్రికెట్ బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. పోలీసులు ఎప్పటి కప్పుడు చర్యలు చేపడుతున్నా కూడా ఇలాంటివి ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఈ బెట్టింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు.భారీగా బెట్టింగ్ దందా విశాఖ నుంచే సాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లే లేవు కాదా.. బెట్టింగ్ దేనిపై నిర్వహిస్తున్నారని డౌట్ పడుతున్నారు.


విశాఖ నుంచి పాకిస్థాన్ లీగ్ మ్యాచ్ లపై బెట్టింగ్ నిర్వహిస్తుంటే పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు..మధురవాడలో క్రికెట్‌ బెట్టింగ్‌ స్థావరంపై పీఎం పాలెం పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేశారు. శ్రీరామ్ ప్రాపర్టీస్‌ భవనంలో పాక్ లీగ్ మ్యాచ్పై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ల్యాప్ టాప్ లు, 2 టీవీ లు, 32 ఫోన్లు, భారీగా నగదును స్వాదీనం చేసుకున్నారు.


శ్రీరామ్ ప్రాపర్టీస్ సెలబ్రిటీ టవర్స్ ఫ్లోర్ 15 ఫ్లాట్ నెంబర్ 1 లో టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి స్థానిక పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠాకి చెందిన సభ్యులు గత మూడు నెలలుగా ఇక్కడ అద్దెకు ఉంటున్నట్టు తెలుసుకున్నారు.. ఈ దాడి లో ప్రధాన నింధితుడు మాత్రం దొరక లేదు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ కేటుగాడి కోసం గాలిస్తున్నామన్నారు పోలీసులు. మిగతా వాళ్ళను అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.క్రికెట్ బెట్టింగ్ లాంటి కార్యకలాపాలకు ఎవరు పాల్పిడినా కఠినంగా శిక్షిస్తామన్నారు పోలీసులు.. ఈ ఘటన తో విశాఖ నగరం ఉలిక్కి పడింది.. ఈ విషయం పై పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: