ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది డిహైడ్రేషన్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనివల్ల శరీరం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా వాతావరణం లోని మార్పులు అయినప్పటికీ శరీర స్థితి పైన ఆధారపడి ఉంటుంది. అందుకే కొన్ని సందర్భాలలో వేసవికాలంలో ముక్కు నుంచి కొంతమందికి రక్తం కారుతూ ఉంటుంది. అయితే ఇలా ముక్కు నుంచి రక్తం కారకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


వేసవి కాలంలో గాలిలో తేమ తగ్గిపోయి వేడి మరియు పొడిగాలి ఎక్కువగా వేస్తుంది. దీని వల్ల ముక్కు లోపల చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి , ముక్కు లోపల ఉండే సున్నితమైన రక్తకణాలు ఎండిపోయి మరి చిట్లిపోతాయి.

బయట ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరంలో కూడా వేడి పెరిగి రక్తనాళాల పైన చాలా ఒత్తిడి పడుతుందని అందువల్ల కూడా రక్తం వస్తుంది.

అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్, ముక్కులో వేలు పెట్టుకోవడం లేదా గట్టిగా తుమ్మడం వల్ల కూడా రక్తస్రావం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా హై బీపీతో ఉన్నవారికి కూడా ఈ సమస్య కనిపిస్తుంది.


రక్తస్రావం అవుతున్నప్పుడు ఏం చేయాలంటే?
పడుకోవడం కంటే నిటారుగా నిలుచుని  స్ట్రైట్ గా ఉండడం మంచిది.

ముక్కును నొక్కి పట్టుకొని కొద్దిసేపు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం మంచిది.

నుదుటిమీద, ముక్కు పైన ఐస్ ముక్కలు లేదా చల్లటి నీళ్లను కొద్దిసేపు ఉంచడం వల్ల రక్తస్రావాన్ని రక్తనాళాలు ఆపుతాయి.

చేయకూడని పనులు:
ముక్కులో దూది పెట్టడం టిష్యూ పేపర్లను ఉపయోగించడం వల్ల మంచిది కాదు.

అలాగే రక్తం ఆగిన వెంటనే ముక్కును గట్టిగా చీరడం వంటివి చేయకూడదు.

జాగ్రత్తలు:

డిహైడ్రేషన్ కాకుండా నిరంతరం తగిన నీళ్లు పండ్ల రసాలను తాగడం మంచిది.

ముక్కులోపల తేమను నిలుపుకోవడానికి అప్పుడప్పుడు ఆవిరి పట్టడం కూడా చాలా మంచిది.

లోపల కొద్దిగా కొబ్బరి నూనెను పూయడం వల్ల పొడిబారకుండా ఉంటుంది.

ముక్కు నుంచి రక్తం అప్పుడప్పుడు కారణం సాధారణమైన 20 నిమిషాల పైగా  ఎక్కువ సేపు ఆగకుండా వస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: