ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో ఆర్ఎంపీ డాక్టర్లు వ్యవహరిస్తున్న తీరు సంచలనంగా మారిపోతుంది. ఏకంగా ఎంతోమంది ప్రాణాలను రిస్క్ లో పెట్టేస్తున్నారు ఆర్ఎంపీ డాక్టర్లు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. తెలిసీ తెలియని వైద్యం చేసి ఏకంగా ఒక అభంశుభం తెలియని బాలిక ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడు ఇక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ జ్వరం వచ్చిన బాలిక సమీపంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఇక ఆ బాలికకు వైద్యం అందించాడు ఆర్ఎంపీ డాక్టర్. కానీ అంతలోనే ఆ బాలిక పరిస్థితి మరింత విషమించింది. జ్వరం వచ్చిందని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరి కి వెళ్తే చివరికి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది ఆ బాలిక. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఇటీవలే ఓ బాలిక జ్వరంతో బాధపడుతూ సమీపంలో ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అయితే జ్వరం వచ్చిన బాలికకు హైడోస్ ఇంజక్షన్ ఇచ్చాడు ఆర్ఎంపీ డాక్టర్. దీంతో కేవలం క్షణాల వ్యవధిలోనే శరీరం అంతా బొబ్బలు వచ్చింది. అంతేకాదు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది బాలిక. ఆ ఒక్కసారిగా కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే ఆ బాలికను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది ఆ బాలిక పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానికులు ఎంపీ డాక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ అయినప్పటికీ తెలియని వాటికి కూడా వైద్యం చేస్తూ ఎంబిబిఎస్ డాక్టర్ లాగా కవరింగ్ ఇస్తూ ఉంటాడని చెబుతున్నారు. అయినప్పటికీ జిల్లా వైద్య అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి