ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది యువతీ. అయితే వివాహం జరిగిన రెడు నెలలకే అంతా తలకిందులైంది. ఇక భర్తతో సంతోషంగా ఉండాని అత్తింట్లో అడుగుపెట్టిన ఆమెకు నిత్యం వేధింపులే ఎదురైయ్యాయి. ఆమెకు అత్తా, భర్త ఇద్దరు నరకం చూపించారు. ఇక ఆ వేధింపులను తట్టుకోలేని ఆ యువతీ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాకలోని చెల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన అక్కల రాధా కిషన్, లక్ష్మి దంపతులకు పవిత్ర కూతురు ఉంది. ఇక ఆమెకి మే 28నన ఘనంగా పెళ్లి చేశారు. అయితే దుబ్బాక మండలంలోని గంభీర్‌పూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే పవిత్ర అత్తింటికి వచ్చిన తర్వాతం వారం, పది రోజులు అంతా మంచిగానే ఉన్నారు. ఆ తరువాత పవిత్ర అత్తతో పాటు భర్త కూడా ఆమెను వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టారు. ఇక అత్త సూటిపోటి మాటలతో మానసిక క్షోభకు గురిచేస్తే.. కట్టుకున్న భర్త తరచూ కొడుతూ శారీరకంగా చిత్రహింసలకు గురి చేసేవాడు. ఆ తరుణంలో ఆమె మానసికంగా చాలా కుంగిపోయింది.

ఇక ఆమె అనుభవిస్తున్నా ఈ బాధను ఎవరితో చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే  బీఎడ్‌ సెమిస్టర్‌ పరీక్ష ఉండటంతో భర్త శ్రీకాంత్‌ గౌడ్‌ ఆమెను దుబ్బాకలోని కాలేజీ వద్ద వదిలి పెట్టాడు. అయితే ఆమె పరీక్ష రాసిన తర్వాత ఇంటికి వెళ్లకుండా.. తన అన్న స్నేహితుడి ఫోన్‌కు మెసేజ్ పంపించింది. ఆమెకి తనకు జీవితంపై విరక్తి కలిగిందని.. ఇక బతకలేనని మెసేజ్ పెట్టి ఫోన్‌ స్విచ్‌ చేసింది. ఇక అనంతరం కాలేజీ నుంచి కాలినడకన వెళ్లి పట్టణ సమీపంలోని పెద్ద చెరువులో దూకి.. ఆత్మహత్యకు పాల్పడింది.

అయితే పవిత్ర అన్న స్నేహితుడు వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమచారం అందించాడు. అతడు చెప్పిన మాటలు విని షాకైన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మరసటి రోజు పవిత్ర మృతదేహం చెరువులో తేలడంతో స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి భర్త, అత్తలను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: