2021లో విడుదలైన అఖండ సృష్టించిన సునామీని మించిపోయే స్థాయిలో ఈ సీక్వెల్ తెరకెక్కిందని ట్రైలర్ స్పష్టంగా చూపించింది. బాలయ్య ఫ్యాన్స్ కోరుకునే భీకర యాక్షన్, మూడ్‌ను ఎగిరేలా చేసే భారీ డైలాగులు – ఈసారి రెట్టింపు స్థాయిలో ఉన్నాయి.
ట్రైలర్‌లో ఏం ఉంది?
“కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి… కష్టమొచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి” అనే పవర్ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. దీనితోనే సినిమాలో సనాతన ధర్మం నేపథ్యాన్ని బోయపాటి ఎంత గ్రాండిగా రాబోతున్నారో వెల్లడవుతోంది. బాలకృష్ణ నోట నుంచి వచ్చే ప్రతి డైలాగ్ థియేటర్లలో అరుపులు కేకలు పెట్టించేలా ఉన్నాయి. ఆధ్యాత్మికత, పౌరాణిక స్పర్శ, అఘోర తత్త్వం… ఇవన్నీ బోయపాటి మార్క్ మాస్ మేనర్లో కలిసిపోవడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అఖండలో దర్శనమిచ్చిన అఘోరా అవతారాన్ని ఈసారి బోయపాటి మరింత లోతైన శక్తితో, విస్తారమైన కాన్వాస్‌పై చూపిస్తున్నారు. అఘోర క్యారెక్టర్ యొక్క లోర్, పవర్, మైథాలజికల్ కనెక్షన్స్… ఇవన్నీ ట్రైలర్‌లోనే చిరు భాగంగా కనిపించాయి. సినిమాలో ఈ యాక్షన్–ఆధ్యాత్మిక యూనివర్స్ ఎంత పెద్దగా ఉండబోతుందో చెప్పకనే చెప్పింది.
తాజాగా చిత్రబృందం ఈ సినిమాను 2డ్తో పాటు 3డ్ వెర్షన్‌లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సినీప్రియులకు కొత్త విజువల్ అనుభవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బాలయ్య మాస్ యాక్షన్ 3డ్లో ఎలా కనపడుతుందో అన్న కుతూహలం మరింత పెరిగింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న అఖండ 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. బోయపాటి–బాలయ్య కాంబోపై ఉన్న నమ్మకం, ఇప్పుడు వచ్చిన ఈ ట్రైలర్… ఇవన్నీ సినిమా వైపు భారీ హైప్‌ను తీసుకొస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి