ఆడపిల్ల ఏడుపు మంచిది కాదు అని చెబుతూ ఉంటారు. ఆడపిల్ల ఏడిస్తే అరిష్టం జరుగుతుంది అని అంటూ ఉంటారు..  అందుకే ఆడపిల్ల కళ్లనుంచి కన్నీరు రాకుండా చూసుకోవాలి అని చెబుతూ ఉంటారు. ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి అరిష్టం జరిగితే ఇక దేశంలో ప్రతిరోజు ప్రతిక్షణం ఆడపిల్లలు ఏదోఒక చోట అత్యాచారం గురై అరణ్యరోదనగా విలపిస్తున్నారు. దీంతో దేశం బాగుపడుతుంది.  రోజురోజుకు మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. మగాళ్ళు ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు మృగాల్లలా మారిపోతున్నారు.



 ఇంట్లో అమ్మ,చెల్లి,భార్య, కూతురు లాంటి ఆడ పిల్లలు కూడా ఉన్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు చేయడం మంచిది కాదు అన్న విషయాన్ని మరిచిపోయి మానవత్వం లేకుండా దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు అటు ప్రభుత్వాలు కూడా ఎన్నో కఠిన చట్టాలు తీసుకువచ్చాయ్. కానీ ఆ చట్టాలు ఆడపిల్లలకు పూర్తిస్థాయి రక్షణ మాత్రం కల్పించలేకపోతున్నాయ్. దీంతో రోజురోజుకు ఆడపిల్లల భద్రత ప్రశ్నార్థకంగా మారిపోతోంది.



 ఈ సృష్టికి జీవం పోసిన ఒక ఆడపిల్ల నేటి సమాజంలో ఎందుకు పుట్టానా అని బాధ పడే పరిస్థితులు ప్రస్తుతం దాపురిస్తున్నాయ్. ఇటీవలే ఉత్తరప్రదేశ్లో కూడా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.  యువతిపై దారుణంగా అత్యాచారం చేసిన ఒక కామాంధుడు అంతటితో ఆగకుండా ఏకంగా పదవ అంతస్తు నుండి యువతిని కిందకి తోసేశాడు.  ప్రతీక్ వైస్ అనే 40 ఏళ్ల వ్యక్తి కాన్పూర్లో ఒక డైరీ నడిపిస్తున్నాడు. ఇక ఈ డైరీలో 19 ఏళ్ల యువతి పనిచేస్తుంది. అయితే ఎన్నో రోజుల నుంచి యువతి పై కన్నేసిన ప్రతీక్ ఇటీవలే ప్లాంట్కు పిలిపించుకుని ఆమెపై అత్యాచారం చేశాడు.  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అని చెప్పడంతో.. ఆమెను పదవ అంతస్తు నుంచి తోసేశాడు. దీంతో బాలిక చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: