నిందితుడు కోరిన క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించారు. అయినా అతను ఏళ్ల తరబడి శిక్ష అమలు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకు తగిన దారులు వెతుక్కుంటున్నాడు. ఈ విషయం తాజా తీర్పుతో వెలుగు చూసింది. చిన్నారులకు విద్యాబుద్ధలు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. అతని పై ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 19 అత్యాచార కేసులు నమోదయ్యాయి. కర్ణాటకకు చెందిన అపర కీచకుడి ఇతివృత్తం ఇది. ఆ రాష్ట్ర పరిధిలోని చిత్రదుర్గకు చెందిన ఉమేశ్ రెడ్డి ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ గా చేసుకుని అత్యాచారం చేసే వాడు. అంతటితో ఆగక వారిని హతమార్చేవాడు. ఈ క్రమంలోనే అత్యాచారం చేసి ఆమెను హతమార్చే యత్నంలో ఉండగా అమె అతని నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గాలింపులు జరిపారు. ఫలితం శూన్యం.
పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో నని అతడు చిత్రదుర్గ వదలి బెంగళూరు పారిపోయాడు. అక్కడ కూడా తన ప్రవృత్తిని మానుకో లేదు. బెంగళూరులోని సెలూన్ లో ఉండగా పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. వివరాలు సేకరించతారు. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. 1998లో ఓ ఒంటరి మహిళను అత్యాచారం చేసి హత్య చేశాడు బెంగళూలోని సెషన్స్ కోర్టు 2006లో ఉరిశిక్ష విధించింది. నిందతుడు మహా మేధావికదా ! ఏకంగా తన శిక్ష తగ్గించాలంటూ ఏకంగా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు. విశేషాధికారాలు కల్గిన రాష్ట్రపతి కీచక ఉపాధ్యాయుడి విజ్ఞప్తిని తిరస్కరించారు. అంతటి కథ ముగిసి పోలేదు. ఈ దఫా సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టాడు. తనకు ఉరిశిక్ష వంటి పెద్ద శిక్ష వద్దని, దానిని జీవిత ఖైదు గా మార్చాలని విజ్ఞప్తి చేశాడు. వాదనలు విన్న సుప్రీం కోర్టు దీనిని హైకోర్టులోనే పిటీషన్ దాఖలు చేయాలని సూచించింది. దీంతో మరలా కేసు హైకోర్టుకు వచ్చింది. హై కోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ ప్రదీప్ సింగ్, జస్టిస్ అరవింద్ ల నేతృత్వంలోని ధర్మాసనం సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది. నిందితుడికి ఉరిశిక్షే సరైన శిక్ష అని తెలిపింది. అయితే నిందితుడి పై 19 అభియోగాలు రాగా, పదకొండు కేసుల్లో శిక్ష పడింది. మరో ఎనిమిది కేసుల్లో తీర్పులు రావాలి. తాజా గా హై కోర్టు తన తీర్పులో నిందితుడికి వెసులుబాటు కల్పించింది. సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకునేందుకు ఆరువారాలు గడువు ఇచ్చింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి